Saturday, February 7, 2009

అన్నమయ్య అలమేలుమంగా శ్రీవేంకటేశ్వర శతకం....



అన్నమయ్య అలమేలుమంగా శ్రీవేంకటేశ్వర శతకం....తెలుగులో

శ్రీసతి నీలజాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా
త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱు(న్)
జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ
మూసిన ముత్యమై యురము ముంగిట( జెంగట వేంకటేశ్వరా !

కన్నులుగల్గి కొమ్మ నిను గప్పము( జేకొన లేతనవ్వు నీ
కెన్నడు మోవి నిచ్చినదొ యేగతి మెచ్చితొ యెట్టులుండెనో
యన్నిట, నేనెజాణ నని యందువు శ్రీయలమేలుమంగకే
మన్నన నెట్టు లిచ్చితివొ మాటల జిక్కవు వేంకటేశ్వరా ! 2

చ . కిలకిల నవ్వు నవ్వి తిలకించితి మంచి సుధారసంబు నీ
పలుకుతేనెలన్ విభుని(బట్టము( గట్టితి నీదుకౌగిటన్
వలదని చెప్పినన్ వినవు వద్దుసుమీ యలమేలుమంగ నీ
కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా ! 3

ఉ:నీవును దాను గూడె దరుణీమణి శ్రీయలమేలుమంగ నా
నావిధవైభవంబుల ననారతముం జెలువొందు నేడు నీ
వావలి మోము చేసి తని యప్పటినుండియు( బల్క విట్టులా
దేవర చిత్తమెవ్వరికి (దేర్పగ శక్యమె వేంకటేశ్వరా ! 4

ఉ:యో లలితాంగి ! యో కలికి ! యో యెలజవ్వని ! యో వధూటి ! యో
గోల ! మెఱుంగుజూపుకనుగోనల నోయలమేలుమంగ మ
మ్మేలిన తల్లి నీవిభున కించుక మాదెసచూపుమంచు నీ
పాలికి జేరి మ్రొక్కుదురు పద్మభవాదులు వేంకటేశ్వరా ! 5

చ.చికురభరంబుచే (నదిమి) శ్రీలలితాంగివి నీవు నాగుణా
ధికునియురముపై రతుల(దేలుచు శ్రీయలమేలుమంగ నీ
లికుచకుచ ప్రభావమున లేతవయస్సున నింత నేతురా
వెకలి వటండ్రు నెచ్చెలులు వేడ్కల నీసతి వేంకటేశ్వరా 6

చ.ఒకమరి నీవు కన్గొనల నొయ్యన(జూచిన నీవిభుండు లో(
గకవిక( దర్చు( జేరునట కౌగిటి కోయలమేలుమంగ నీ
వికచ విలాస మంచు నరవిందమరందపు(దేనెపల్కులన్
బికశుకపంక్తి నీకు( దలపించును నీసతి వేంకటేశ్వరా! 7

ఉ:కూరిమి సానవట్టిన చకోరపు(గన్ను(గొన దళుక్కునన్
జేరువ మించులై మెఱయ జిమ్ములబొమ్మల( బంపు నవ్వు దై
వారగ( గాంచి నీతరుణి వన్నెల శ్రీయలమేలుమంగ నీ
సారపు నేర్పు( జక్కగొనె( జక్కని మోమున వేంకటేశ్వరా ! 8


ఉ:ఆయలసంబు లానడపు లాకను(గ్రేవల ముద్దుచూపు లా
యాయెలనవ్వు మాటల ప్రియంబులు నీకలమేలుమంగ నీ
మాయలొ ప్రాణవల్లభుని మక్కువ చేతలొ చెప్పు మంచు లే(
బ్రాయపు నీసతిం జెలులు పల్కిరి పల్మఱు వేంకటేశ్వరా ! 9


ఉ:కిన్నెర మీటి మీటి పులకించి తలంచి మనోజలీల( దా
నున్న తెఱంగు నెచ్చెలుల కొయ్యన(జెప్పగబూను( జెప్పరా
కన్నువ సిగ్గుతో నలరు నల్లన శ్రీయలమేలుమంగ నీ
వన్నెలసేత లెట్టివొ సువాళము లెట్టివొ వేంకటేశ్వరా ! 10

చ.సరసిజసంభవాది దివిజప్రకరంబులసంపదల్ సువి
స్తరములు గా(గ( గన్గొనల జల్లెడు శ్రీ యలమేలుమంగ నీ
తరుణి యురంబునం జెలగ(దన్మయ మందెడు నీకు బ్రాతియే
పరమపద ప్రభుత్వము నపారమహత్త్వము వేంకటేశ్వరా ! 11

తరుణి! మహా నిధానమ! సుధామయకూపసమస్తవైభవా
భరణమ! దేవదేవుని కృపామతి! యోయలమేలుమంగ! నీ
కరుణయు జాలు లోకముల( గావ(గ నంచు మునీంద్రులున్
సురల్ నిరతి నుతించి మ్రొక్కుదురు నీప్రియకాంతను వేంకటేశ్వరా ! 12

చెదిరిన చిన్ని లేగురులు చెక్కున జాఱగ ముద్దుమోముతో
వదలిన కొప్పుతోడ నిడువాలిక కన్నులు నిగ్గు దేఱగా
నుదుటున నిన్ను గూడి మహిమోన్నతితో నలమేలుమంగ నీ
యెదుట మనోజసంపదల నేగతి నుండెనొ వేంకటేశ్వరా! 13

తొలకరిమించు తొయ్యలి వధూమణి చక్కని తల్లి మానినీ
తిలకమ దేవదేవుని సతీమణి యోయలమేలుమంగ నీ
సొలపులచూపులే విభునిచూపులవిందు లటంచు నెచ్చెలుల్
పలుకగ నిన్నుజూచి నగు(బైకొని నీసతి వేంకటేశ్వరా! 14

తలచు( గరంగు మైమఱచు( దన్మయ మందును జిత్తజాగ్నిని
న్నలయుచు దూరు నుస్సురను నర్మిలితో నలమేలుమంగ నీ,
వలిగిననంతనే కడు( బ్రియంబిక నేమని చెప్పనేడువో
కలిగిన మింతయు( బ్రకాశము తోచెడు వేంకటేశ్వరా ! 15


నించిన పంచదారలును నేతులు దేనెలు( గమ్మ గా(గ( దా
లించినకూరలున్ బరిమళించగ నయ్యలమేలుమంగ వ
డ్డించిన నిర్మలాన్నములు డెంద మెలర్ప(గ నారగింతు నీ
మించిన వేయిచేతులను మేలములాడుచు వేంకటేశ్వరా ! 16


అతడె నీవు, నీవనగ నాతడు, నీపలుకే తలంపగా
నాతనిపల్కు 'నీ హృదయ మాతడె పో ' యలమేలుమంగ నీ
చేతిదె సర్వజంతువుల జీవనమంతయు నంచు సన్ముని
వ్రాతము సన్నుతించు ననివారణ నీసతి వేంకటేశ్వరా ! 17

లోలవిలోలనేత్రకు( దళుక్కున ఱెప్పలు వంచి యెత్తినన్
మేలిమి( జెక్కుటద్దముల మేలములై యలమేలుమంగకున్
నీలపయోదపుందుఱుము నిగ్గుతటిల్లతలే యటంచు ను
న్మీలనిమీలనంబులకె మెత్తువు నీవును వేంకటేశ్వరా 18

పక్ష్మలనేత్ర ! యోచిలకపల్కుల కల్కి ! సరోజవల్లి ! యో
లక్ష్మి లతాంగి యోబహుకళావతి యోయలమేలుమంగ నీ
సూక్ష్మ వివేక లీలలకు( జొక్కితి నంచు నఖేందువల్లికా
లక్ష్మివికాసత సతి(జెలంగగజేతువు వేంకటేశ్వరా ! 19

లలితపు కంకణాంకలధ్వని ఘల్లని మ్రోయ నుంగరం
బులు మణినీలకాంతుల ప్రభుత్వముతో నలమేలుమంగ గు
బ్బల ప్రెనువ్రేగుతో( దుఱుముభారముతో నిను( జేరవచ్చు నం
దెలు మెలనూలు ఘంటలు( బ్రతిధ్వనులీనగ వేంకటేశ్వరా ! 20

కుంకుమ కస్తురీ ప్రభ బుగుల్కొన( జెక్కుల( జార దివ్యతా
టంకమణిప్రభా ప్రతివిడంబముతో నలమేలుమంగ భ్రూ
జంకెల నందలింపగనె జల్లనె( జిత్తము నీకు నంతలో
నంకన మించు మిమ్ము( బులకాంకురకోటులు వేంకటేశ్వరా 21

కస్తురి పచ్చకప్పురము( గమ్మని పుప్పొడి ధూళ్ళు హత్తి శ్రీ
హస్తమునందు(తట్టుపును(గందుచు శ్రీయలమేలుమంగ భా
రస్తనవైభవంబుల( గరంగుచు నిన్ను గఱంగ మెత్తు నీ
కౌస్తుభరత్న సౌధమున( కౌగిటిపాన్పున వేంకటేశ్వరా! 22

అందపు కోసి యిమ్ము విరు లంచును జే రలమేలుమంగ ని
న్నుందగ(గోర జెక్కులటు నొక్కిన నాకును నందవంచు న
య్యందుముఖిం బ్రియంబలర నెత్తుచు పువ్వులు కోయజేయ ని
ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను వేంకటేశ్వరా 23

ఒక్కొక్కనాటిరాత్రి సకలోన్నుతుడైన ఖగేంద్ర మూర్తిపై
నెక్కి వొనోదలీల( జరియించుచు నయ్యలమేలుమంగ మో
మక్కున( జేర్చుచు బహువిహారముల వనవీథులంబ్రియం
బెక్కువగా( జెలంగువిధ మే మని చెప్పుదు వేంకటేశ్వరా ! 24

దుగ్ధపయోధికన్య జలధుల్ జగముల్ దనకుక్షినున్న సు
స్నిగ్ధకృశోదరాంగి తులసిం బ్రియురాలలమేలుమంగ
యీ ...... ..... .... నుచు నిన్ను మునీంద్ర కన్యకల్
దిగ్ధరణీధరంబుల నుతింతురు నవ్వుచు వేంకటేశ్వరా ! 25

పాయని జాజిపువ్వులనే పట్టుక బాయ ......
........రాహుతుడావైనపు డాయలమేలుమంగ ని
శ్శ్రేయసలక్ష్మి నీశరము చెంగట నొప్పె(దురుష్క దేసబి
బ్బీయెలపువ్వు పయ్యెదనె ప్రేమపునువ్వున వేంకటేశ్వరా ! 26

యో చెలి! యో లతాప్రతిమ! యో మృగలోచన! యోచకోరిరో!
యో చదులాల ! యోచిలుక ! యో..యలమేలుమంగ నీ
చూచిన చూపులే విభుడు చూచినచూపులటంచు నీసతిన్
ఖేచరసిద్ధి కామినులు కీర్తన సేతురు వేంకటేశ్వరా! 27

మంగళమమ్మకున్ సకలమంగళ మంబుజనేత్రికిన్ జయా
మంగళ మిందిరా సతికి మంగళమీయలమేలుమంగకున్
మంగళమందు నే మరియు మంగళమందును దేవలోక ది
వ్యాంగనలెల్ల నీసతికి నారతు లిత్తురు వేంకటేశ్వరా ! 28

వెలది మహాపరాధములు వేయును జేసితి గావుమన్న నీ
పులకలు మేనిఘాతలును బూతలు జూ చలమెలుమంగ నీ
యలకలు దీర్చి చెక్కు చెమ టల్లన గోళ్ళను జిమ్మి పయ్యెదన్
బలుచని నవ్వుతో విసరు( బై చెమటారగ వేంకటేశ్వరా ! 29

ఏ చతురత్వ మేమహిమ మేమి విలాస మదేమి విభ్రమం
బీ చెలువంపు సంపదయు నిందుముఖుల్ జగదేకమోహినుల్
చూచి తలంట వేడ్కపడి చూతురు నీయలమేలుమంగ లీ
లాచికురంపు( గ్రుమ్మెడి కెలంకుల నిగ్గులు వేంకటేశ్వరా ! 30


పరిమళమో కదంబమొ ప్రభల్ విడ నించిననిగ్గొ నిర్మలా
భరణమొ నిత్యవైభవమొ భాగ్యమొ శ్రీయలమేలుమంగ భూ
ధరునకు నాదిలక్ష్మి యని తత్త్వమహత్త్వరహస్యవేత్తలం
బరమున నుండి నీవనిత( బ్రస్తుతి సేతురు వేంకటేశ్వరా ! 31

తిరుమగు మంచి కుందనపు(దీగపయిన్ ఘనచక్రవాకముల్
పరిగినరీతి( జన్నుగవ భావముతో నలమేలుమంగ నీ
యురముపయిం జెలంగ(గని యోగిజనంబులు నీలమేఘవి
స్ఫురణముతోడి మిం చనుచు(జూచి నుతింతురు వేంకటేశ్వరా ! 32


కొలదికిమీఱు ( గ్రొవ్విరులు కొప్పున(జాఱగ( జూపుకన్నుల(న్)
గులుకుచు నుండ నెన్నుదుటికుంకుమతో నలమేలుమంగ వె
న్నెలనును(దీగయై కళలునించిన పుత్తడి బొమ్మయై నినుం
గలికి కరంబునం జెనయ(గంటిరిగా తమి వేంకటేశ్వరా ! 33

పెడమర చూచి చూపు జళిపించిన నెట్లు ధరింతువో ప్రియం
బడర(గ( గౌనుదీగ నులియన్ ................ నన్
సడివడి యెంతవేగుదువొ చక్కని శ్రీయలమేలుమంగ నీ
వెడవగు మోముజూచి నగి వెన్నెల చల్లిన వేంకటేశ్వరా ! 34


.......... గుజ్జెన గూళ్ళును బైడిపొళ్ళు మా
యమ్మకు బొమ్మరిళ్ళు లలితాంగికి మాయలమేలుమంగకున్
బొమ్మలు బొమ్మపొత్తికలు బోనపుదొంతు లటంచు నీసతిన్
నెమ్మి భజించి మ్రొక్కుదురు నిర్జరకాంతలు వేంకటేశ్వరా 35

ఓ కమనీయ కంజముఖి ! యోవలరాయని తల్లి! యోసుధా
సైకతచాతురీజఘన చక్రిణీ ! యోయలమేలుమంగ ! నీ
వే కరుణించి కావుమని వేడ్కల నింద్ర పురంధ్రు లందఱున్
బైకొని నీలతాప్రతిమ బ్రస్తుతి సేతురు వేంకటేశ్వరా ! 36

జాగరమేల జేసెదవు చంద్రనిభానన పవ్వళింపు నీ
భోగపైశ్రంబులకు భూషణమై యలమేలుమంగ నీ
యోగవియోగలీల లని యోగికన్యలు నీవధూటి నా
యాగతి బుజ్జగింతురు మహావినయంబున వేంకటేశ్వరా ! 37

పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టి ప్రపంచమంతకున్
తల్లి సమస్తజీవులనిధానమ శ్రీయలమేలుమంగ నీ
చల్లని చూపు చిల్కి వెదజల్లగ పుణ్యులమైతి మండ్రు భూ
మెల్లను నీవధూమణి ననేకవిధంబుల వేంకటేశ్వరా ! 38

చెఱగిడ(గా నదల్చెదవు చేరిన దిట్టెదు కౌగిలించినన్
గొఱ(తలె యెన్న(జూచెదవు * కోపము నద్దలమేలుమంగ నా
వెఱ పి(కనైన దీర్పుమని వేడ్కల నీవు మనోజలీలలన్
దఱితఱి నింతి( గూడుటలు( దత్తఱపాటులు వేంకటేశ్వరా ! 39

* 'కోపము నందల మేలుమంగా నుందనోపు

రాపుగ మమ్ము నేయునపరాధశతంబుల సంతముల్ సదా
..........................................................................................
...........................................................................................
కాపురమున్ నిరంతరము కల్కితనంబును వేంకటేశ్వరా ! 40

వెలయ వసంతవేళ వనవీధుల సంపగిపువ్వుటిండ్లలో
నలరుచు( బుష్పవృష్టి నలపార్చుచు నీ వలమేలుమంగతో
నలర(గ నే(గి వచ్చి యలపార(గ( గస్తురినీట మజ్జనం
బెలిమి వహించి గంధతతు లిన్నియు( గ్రమ్మఱ మజ్జనంబు పెం
పొలయ(గనాడుతీర్థముల నుబ్బ్బు పయోధులు వేంకటేశ్వరా ! 41

వెలయ(గ నేంకటాచలమువీధుల( గమ్మనిపుష్పవృష్టి కిం
పలర(గ నేగి వచ్చి యలపారగ నయ్యలమేలుమంగతో
నలర(గ( గోరకమ్ముల లతాంగన లిమ్ముల సేస(జల్లగా(
గలకల నవ్వు మిమ్ము గలకణ్ఠశుకావలి వేంకటేశ్వరా ! 42

యెక్కడి కేగి వచ్చింతి రమేశ్వర నీతనుదివ్యగంధ మే
చక్కనియింతిమేని దని సారెకు నీయలమేలుమంగ నీ
చెక్కు గళంబు గోళ్ళ వడి జేర్చుచు నీయలపార్చి వేడుటల్
మక్కువగల్గుకాంతలకు మర్మరహస్యము వేంకటేశ్వరా ! 43

..............లను బబ్బిలికాయలు పై(డిమట్టియల్
మోద మొలర్ప నందియలు మ్రోయ(గనయలమేలుమంగ క
త్యాదరలీల)బాడ బలువంచును వేదము...........'
.............................ను వేంకటేశ్వరా ! 44


కాంచనరత్న నూత్న కటకంబులు సందులదండలు బ్రభల్
ముంచిన మేఖలావళులు మ్రోయగ నయ్యలమేలుమంగ నే
త్రాంచలగర్వవీక్షణసుహాసముతో నిను( గోరి భ్రూలతన్
వంచిన దియ్యవిల్లు కడవంచు మరుండును వేంకటేశ్వరా ! 45

వొప్పగు తూ(గుటుయెయ్యలల నూగుచు నీ వలమేలుమంగతో
నప్పుడు కౌ(గిట న్రతుల నా(కటిపెల్లున నప్పళించున్
ఱెప్పలనవ్వుతో మనసుఱిచ్చలతో నఱగన్నులార్చున్
దెపల(దేలు సౌఖ్య మిదె దేవరహస్యము వేంకటేశ్వరా ! 46

గీసినగోళ్ళ చే( బసి(డి కిన్నరకంపితముల్ కదల్చుచున్
రాసెడిగుబ్బచన్నులభ్రంబున నయ్యలమేలుమంగతో
మూసియౌ మూయ కక్షు లరమోడ్చుచు ఱెప్పల( దేల(జే
య(గా నాసల నీవు తన్మయము నందుట చిత్రము వేంకటేశ్వరా ! 47

దొరలిన మేనిగందపొడిధూళి వసంతము ఘర్మవారిపై
జఱచినపువ్వు(దేనెల వసంతము నీకలమేలుమంగకున్
నెఱసి కరంగు చిత్తములు నీళ్ళా వసంతము మీకు మీకు నీ
యెఱపులు నీప్రియంబులు మహోన్నతు లెట్టీవో వేంకటేశ్వరా ! 48

చక్కనితల్లికిన్ నవరసంబుల వెల్లికి( బుష్పవల్లికిం
జక్కనిమోవిముత్తియపుజల్లికి శృఈయలమేలుమంగకున్
జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెఱుంగుదీగ లా
క్రిక్కిరిగుబ్బలే పసిడికిన్న రకాయలు వేంకటేశ్వరా ! 49

అరిసెలు నూనె బూరియలు నౌగులు( జక్కెరమందిఘల్ వడల్,
బురుడలు పాలమండిగ లపూపములు య్యలమేలుమంగ నీ
కరుదుగుగ వింధువెట్టు పరమాన్నచయంబులు సూపకోటియు
నిరతి వినిరంలాన్నములు నేతులసోనలు వేంకటేశ్వరా ! 50


కానిక లిచ్చె నీవిభుడు కౌగిట బాంపున గమ్మవల్పుపూ(
దేనెల ఘర్మబిందువుల దేహమునం దలమేలుమంగ నీ
వానగుమోముతో విభుని కంచు (దలిర్చి( గాని తన్మయం
బైనను బాయ దంచు( జెలు లందరు నీసతి వేంకటేశ్వరా ! 51


పెన(గకుమమ్మ! చిమ్ము జళిపించిన చూపుల గర్వరేఖ రా(
జెనకకు మమ్మ! లే(జెమటచెక్కుల నోయలమేలుమంగ నీ
ఘను(డు కళావినోది రతికాంత విలాససహస్రమూర్తి వ
ద్దని పొలయల్క దీర్తురు లతాంగులు నీసతి వేంకటేశ్వరా ! 52

కులుకకుమమ్మ చిమ్ముజిలుకుం గొనచూపుల బిత్తరంబుగా
నులుచకుమమ్మ బొమ్మముడి నూల్కొన(గోపము లేతనవ్వుగా
సొలయకు మమ్మ కల్కి నునుసో(గల నోయలమేలుమంగ నీ
చెలువున నంచు నెచ్చెలులు చేర్తురు నీసతి వేంకటేశ్వరా ! 53

చా(గు బళా జగత్పతికి జా(గు బళా జగదేకమాతకున్
చా(గు బళా రమేశునకు ( జాగు బళా యలమేలుమంగకు
జా(గు బళ యటంచు( గడు( జక్కని కాంతను వీధివీధిమీ
రే(గ(గ నిత్తు రారతు లనేకవిధంబుల వేంకటేశ్వరా ! 54

చొచితి( దల్లి నీమఱు(గు సొంపు(గ నీకరుణాకటాక్ష మొ
ట్లిచ్చెదొ నాకు నే(డు పరమేశ్వరి ! యోయలమేలుమంగ నీ
మచ్చ్క నంచు నీతరుణీ మన్నన నేనిను(గంటి నీకు నా
బచ్చెనమాట లేమిటికి బ్రా( తిదె చూడగ వేంకటేశ్వరా ! 55

యెచ్చరికమ్మ పాదములు నింద్రసింధురనయన తమ్మిపూ
నెచ్చెలి క్రొత్తక్రొత్తపలునిగ్గులతో నలమేలుమంగ నీ
వచ్చిన దా(క నీవిభు(డు వంచిన మోమును నెత్త(డంచు నీ
మచ్చిక యింతి నింతుల మమత్త్వము నెంతురు వేంకటేశ్వరా ! 56

కనకపు(బీఠి నెక్కి రతికాంతశరాకృతి నీవు వీధులం
జనునెడ నీదు చెంగట బ్రసన్నతతో నలమేలుమంగ కాం
చననవకింకిణీరవము సన్నపుదాళగతి రచింప(గా(
గను(గవ మోద్చి రతి(గౌగిట( జేర్తువు వేంకటేశ్వరా ! 57

ఒఱపగుమీవిహారతతు లుప్పనబట్టెలు బిల్లటీపు ల
చ్చెరువుగ బల్లగోటులు ప్రసిద్ద్ధిగ నయ్యలమేలుమంగకున్
మెఱుపులు ముచ్చటల్ రతుల మ్రొక్కలు( దక్కులు వచ్చి వచ్చిమీ,
చిఱునగవుం బ్ర మోదములు చెక్కులనొక్కులు వేంకటేశ్వరా ! 58


చక్కెర బొమ్మ చెక్కులనె సానలు పట్టిన పువ్వటమ్ములో
గ్రుక్కినజవ్వనంబు పెనుగుబ్బలో శ్రీయలమేలుమంగ నీ
వక్కున( జేర్చి పట్ట సకలాధిప సౌఖ్యము నీకు నబ్బెగా
కెక్కువ పంటు కందువల యింపుల సొంపుల వేంకటేశ్వరా ! 59


పరిమళముం బ్రభావము శుభస్థితి నిత్యవిభూతి విభ్రమ
స్ఫురణము దివ్యవైభవము భోగము శ్రీయలమేలుమంగ నీ
యురమున నంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి నీ,
వరవనితాశిరోమణి నవారణ( గొల్తురు వేంకటేశ్వరా ! 60

కులికెడుపండుటమనుల( గోయిలకూతల గుండె ఘల్లనన్
జెలువము గల్గు రాకలను జెంగట శ్రీయలమేలుమంగ కో
విలకలనాదకోటులచవిం మచరింప(గ నెట్టూ లోర్తువో
వలపులవార్దిలోన ననివారణ( దేలుచు వేంకటేశ్వరా ! 61


తొలు(కెడుకొప్పులో నెరులో తుమ్మెదదాటులొ చూపువంపులో
గులుకులో మించివెన్నెలల గుంపులూ శ్రీయలమేలుమంగకున్,
మలుకులు పచ్చకప్పురపు( బల్కులు తావులె దివ్యగంధముల్
పలుచనినవ్వులే విరులపాంపులు నీకును వేంకటేశ్వరా ! 62

అందము చూతు రుప్పవడమై ఘనులాయలమేలుమంగమో
మందము గా(గ జూతువు ప్రియంబున మెల్లననీవటుంద(బో
యందఱిమోముటద్దములు నవ్వల నవ్వుల గోటికొండలై
యందములోన నందములునై వెలుగొందుచు వేంకటేశ్వరా ! 63

తల(చిన గుండె జల్లనును దల్లడమందెడు నేమిసేతు నా
చెలువు(డు రా(డతంచు లలసీనవి నో యమేలుమంగ నీ
తొలకరిమించు నెమ్మనముతొయ్యలి జూడక యెట్టూలోర్తువో
యలుగకు మన్న మాన వి(కనైనను నెన్నడు వేంకటేశ్వరా ! 64

ఆయలమేలుమంగ కమలాననయం గలుహారనేత్రియం
బాయక తానయై చెలగుబ్రద్మ హితాక్షము(జంద్ర నేత్రము
సోయగలీలమించు నెటుచూచిన( బొందిక నెద్ది నిద్ర నీ
కేయడ మేల్కొనంగ( దఱి యెయ్యది చూడగ వేంకటేశ్వరా ! 65
నెఱి నలమేలుమంగకును నీకును పద్మభవాండభాండమే
మెఱసిన బొమ్మరిల్లు తగుమేడలు మీ(దటిలోకముల్ ప్రభల్,
తెఱల(గ మించు నయ్యినుడె దీపము గుజ్జనగూడు చంద్రుడే
తొఱలిన దేవసంఘములె తొత్తులు బంట్లను వేంకటేశ్వరా ! 66

వడి నలమేలుమంగ నిడువాలికచూపునివాళి నీపయి
సుడిసిన తమ్మిరేకులంబ్రసూనశరంబులు గల్వరేకుల
బడిబడి మీ(దమీ(ద రసభావంగ దిగ(బోసినట్ల పో
పొడవగు పువ్వుజొంపముల పూజలు నీకును వేంకటేశ్వరా ! 67

నిను నలమేలుమంగ ఘననీరజపంక్తులు దా(క నేసిన
జను(గవ నొత్తినట్లు కెరజంబుల వాండ్లును నొత్తినట్లు ని
గ్గున( గనుదోయితామరల( గొంకక సారెకు నొత్తినట్లు మై(
జెనకి మరుండు బాణములు చిమ్మ్నీయట్లగు వేంకటేశ్వరా ! 68

అపు డలమేలుమంగ పొల్యల్కలు వద్దని చాటి చెప్పిన
గపటపుటల్క లల్లితివి గర్వితనంబున గాంత కోరమే
రపమునజూతుగా కలుక రాజసలీలల నింత దీఱునా
విపులవియోగతాపమున వేడుకకూటమి వేంకటేశ్వరా ! 69



ఇల నలమేలుమంగ నిను నేమని తిట్టూనో యేకతంబున
గలికి మెఱుంగుడాలు తెలికన్నుల జంకెన నద్దైంపుచు
బలుకులముద్దు లింపొలయ భారపు గుబ్బల దూర నెత్తుచు
జలజల కొప్పుసంపె(గలు జాజులు రాలగ వేంకటేశ్వరా ! 70



తగునలమేలుమంగకును దన్మయమందెడునీకు మేనిలో
మగటులు మచ్చిమాటలను బచ్చెనయెచ్చరికల్ వివేకముల్
మెక్గముల్ లే(తనవ్వులును మోవులనాటులుతమ్మితూటులు
జగడపు(బొందులు రతులసంపదవిందులు వేంకటేశ్వరా ! 71


సరి నలమేలుమంగకును జక్కనిమీకును మీకు మీకు లో
నరుదుగ నేకతస్ఫురణ నమ్ముడు నోయితి రొక్కరొక్కరు
ఇరువురు నింక నేటితెలి వెక్కడినేరుపు లేటిసైరణల్
గిరపులపుచ్చె మేన బులకింతలు వింతలు వేంకటేశ్వరా ! 72

ఒకయలమేలుమంగ మహిమోన్నతి జిక్కితి యోగలీకచే
జికురభరంబు జాఱ నలసె నిఖిలొన్నతు డంచు నీ కృప
బ్రకటములైన కాంత.....యింతరు శీతల క్రియ
మొకంలుల నిగ్గు దేఱ(గను మూచ్చటలాడుచు వేంకటేశ్వరా ! 73

నగ వలమేలుమంగకును నాట వవల్కలు నీకు మాటల
బగ డలమేలుమంగకును బచ్చెనగర్వము నీకు జూపుల
జిగి యలమేలుమంగకును శ్రీమల వేడుక నీకునిట్లపో
మిగిలిన మోహసంపదలు మీరును మీరును వేంకటేశ్వరా ! 74


ఈయలమేలుమంగ మణిహేమకటీరశనాకలాపముల్
రాయంగ రాలు బైడిపొడి రంతులు మీఱినవజ్రపుంబొడి
శ్రీయలరారుకొప్పున బ్రసిద్దిగ రాలెడు కమ్మపుప్పొడి
నీయను(గుంగవుంగిటికి నిచ్చె వసంతము వేంకటేశ్వరా ! 75

ఓయలమేలుమంగ యిది యొక్కటి పో జగదేక భర్తకు
బాయనీకునుం గడమ ప్రాణము ప్రాణము నేకమాయె నీ
కాయము కాయముం గలిసె గౌగిటకాంక్ష యటంచు నీసతి
బ్రాయము నిండుజవ్వనము బల్మఱు మెత్తురు వేంకటేశ్వరా ! 76

ఇతడలమేలుమంగ విభు( డీతడెవో కలశాబ్ధికన్యకు
సతతము జిత్తమిచ్చిన రసజ్ఞుడు ప్రాజ్ఞుడు సర్వవైభవో
న్నతుడు రమాసతీ ప్రియుడు నందకశార్జధరుండటంచు ని
న్నతివలు మెచ్చి మెచ్చి కొనియాడుదు రెప్పుడు వేంకటేశ్వరా ! 77

మాయలమేలుమంగ చలమా యలయించెద వెంతసేసిన
దోయజగంధి నీకు మతితోడనె తక్కిన దల్కనోపు నా
చేయగ నేర్చుచే(త లివె చేయుదుగాక లతాంతసాయంకుం
డీయెడ జేయు వేద్సన లకిన్నియు దోడుగు వేంకటేశ్వరా ! 78

మతి నలమేలుమంగకును మంతనమాడెడు నీవిలాసముల్
తతి(దలపోతలై సురతతాండవసంభ్రమలీలలై సమం
చితరసప్రసంగములు చిమ్మనిదొంతరలై ప్రియంబులై
వితతమనోజవిద్యల న్వీనము లైనవి వేంకటేశ్వరా ! 79

కసిగలచూపు చిమ్ముదును కంకణహస్తము సా(చి కుంచెచే
విసరకు రమ్మనంగ వడి వన్నెలమోమున ముద్గుగుల్కెడి
రసికున కంచు జక్కని పురంధ్రిని నీయలమేలుమంగతో
ముసిముసి నవ్వు నవ్వుదురు మూచ్చటలాడుచు వేంకటేశ్వరా ! 80

నాడలమేలుమంగ జననంబునకై కలశాబ్ధి(ద్రచ్చి యీ
మూ(డుజగంబులందును బ్రమోదము నించితి వట్ల నుండుచో
నా(డు(దనంపుబృంద మదయంబును బొందగ నిత్యసంపదల్
నే(డి(క నేమిటం గడమ నీకృప వారికి వేంకటేశ్వరా ! 81

ఈతరుణీమణీ విభునియిచ్చకు( జాలుతలంప నీయనా
ఈతని మోహనీగజము ఈవని కాయలమేలుమంగ నే(
డీతనువల్లి చక్క(దనము.... .... .... చెలువంబు చాలదా,
యీ తెలిమిం చటంచు నుతియింతురు నీసతి వేంకటేశ్వరా ! 82

మణులవెలుంగు దీపవనమాలికలై పొగడొంద( గంకణ
క్వణనము మేఖలావళులఘంటలు శ్రీయలమేలుమంగకు
బ్రణయవినోద సంపదకు బాయక నీ కొనరించుపూజకై
ప్రణుతనుతప్రభావముల భాగ్యము లైనవి వేంకటేశ్వరా ! 83

కదిసిన్సేసము తైముల కంఠసురుల్ ఘ్నరత్న కంకణాం
గదరశనా..నికాయము శ్రీయలమేలుమంగకు
బ్రయవినోద సంపదకు బాయక నీ కొనరించుపూజకై
ప్రణుతనుతప్రభావముల భాగ్యముఐనవి వేంకటేశ్వరా ! 84

నిగిడి ప యోధి ద్రచ్చు నెడ నిర్జరసంఘము నిక్కి చూడగా
ధగధగ యంచు దిక్కుల నుదగ్రతటిల్లత లుల్లసిల్లగా
దగ నుదయించి మించిన సుధాప్రతి మీయలమేలుమంగ నీ
మగువ యటంచు మెత్తురు సమస్తమునీంద్రులు వేంకటేశ్వరా ! 85

నడవకుమమ్మ పాదనలినంబులు గందెడి, మాట బెట్టుగా
నొడువకుమమ్మ, చెక్కునను నొక్కులతో నలమేలు మంగ నీ
వెడునగ కీమొగంబునకు వెన్నెలలాయె నటంచు నీస్సతి
బడతులు మేలమాడుదురు పల్కుల తేనెల వేంకటేశ్వరా ! 86

బూతలబండ్లనే వలపుబుక్కిట నించితి వాడికోళ్ళనే
ఘాతలు గాగ జించితివి కాయముపె నలమేలుమంగ నీ చేతిదె యంచు
నీతరుణి చెంచ్తల దట్టపునుంగుగస్తురి
జాతుదు రోలి నీదు పరిచారిక కాంతలు వేంకటేశ్వరా ! 87

పచ్చల సందిదండలును బాహుపురుల్ మణినూపురంబులు
మచ్చరికంబులుం బసిడిమట్టెల మ్రోతలు బెల్లు మ్రోయగా
నెచ్చెలు లోలి గొల్వ దరుణీమణి శ్రీయలమేలుమంగ నీ
ముచ్చట దీర్చు నొక్కపరి ముందఱ నిల్చిన వేంకటేశ్వరా ! 88

యేచిన పాతకంబులకు నినిటికి న్నిర్వైనవాడ నే
గాచినకష్టవృత్తి కరిగాపనె యోయలమేలుమంగ నీ
చూచుకృపానిరీక్షణమె చూచెద నంచును నీప్రియాంగన
బూచిన వాకొరసూనముల బూజులు సేసెద వేంకటేశ్వరా ! 89

యోగ్యత్లేనికష్టుడ నయోగ్యుడ నన్నిట జూడ గర్భని
ర్భగ్యుడ నీకృపమతికి బ్రప్తుడ నోయలమేలుమంగ నా
భాగ్యము నీగృపాకరుణ బ్రాప్యము కావుమటంచు సారెనీ
భాగ్యవతీ శిరోమ్ణిని బస్తుతిసేసెద వేంకటేశ్వరా ! 90

తుఱు మఱవీడె బయ్యదయు దోడనె జాఱె మెఱుంగు ఱెప్పల
మరవశభవ మేర్పడియె బాయక నీ వలమేలుమంగ నీ,
వరుని దలంచితో యనుచు వాసనమేనుల దేవ కామినుల్
సరగున నీలతాంగి కుపచారము సేతురు వేంకటేశ్వరా ! 91

రాజసలీల నన్నును గరంబున బట్టకు చూప వేల నీ
తేజము నా కటంచు సుదతీమణి శ్రీ యలమేల్మంగ ని
న్నీ జగదేకనాయకుని నింపొలయించుచు సారెసారెకు
జాజులుకొప్పువీడ సరసంబున వీచును వేంకటేశ్వరా ! 92

చక్కదనంబు రాశి నునుసానల బట్టినపువ్వ్టమ్ములో
జక్కెర నించి చేసిన రసస్థితి శ్రీYఅలమేలుమంగ నీ
మక్కువ జిక్కి మాటలభ్రమం దగులై కలువంత నిట్ల నీ
వక్కున జేర్పగా నలరె నన్నువ కౌగిట వేంకటేశ్వరా ! 93

మానవ్తీసిరోమణికి మంజులవాణికి మోవితేనియల్
కానికలిచ్చినాడ వట కౌగిట నాయలమేలుమంగకు
మీనచకోరనేత్రి నిను మెచ్చి మదంబున గౌగీంచి నీ
పానుపుమీది చేత లివి పచ్చి తలంపులు వేంకటేశ్వరా ! 94

ధళధళ మించు కన్నుగవతమ్ముల మిమ్ముల జూపు చిమ్మిన
గళవళమందకుండుదురె గ్రక్కున శ్రీయలమేలుమంగకు
సళువుల నవ్వు గొంత నునుసోనలగర్వము గొంతనవ్వుగా
కెలపుల గొంతుకొంత పులకింతలు వింతలు వేంకటేశ్వరా ! 95

దర్పక రాజ్యసంపదలు త్న్మయకోటులు రాగిలోకసం
తర్పణ్ముళ్ లతాధరసుధాపరిధానము లాననవ్రతుల్
కర్పురగంధసఊఖ్యములు గ్రక్కున శ్రీయలమేలుమంగకు
మార్పడు దేహసంగతుల మర్మిపుజేతలు వేంకటేశ్వరా ! 96

అంబరమెల్ల( జంద్రమయ మైనటులామదనాంకంల్ మెయి
బంబిన నేడ వంచు సిరి పల్కిన నయ్యల మేలుమంగ పా
దంబుల యాన వెట్టితివి తమ్మియగుళ్ళని నీకు బొంకులే
నెంబళ్మాయె నెవ్వరికి( జెల్లవు రంతులు వేంకటేశ్వరా ! 97

చెఱుగులు చూపి క్రొవ్విరులు చిందెడు తేనెలు నాల్గువంకల
వరదలు వాఱె ఘర్మములు వాహినులై యలమేలుమంగతో(
గఱ్(గుచు నీవు క(గిట సుఖస్థితి( గూడుచు బంధుసంగతి
దెఱు దిగనేసి వేదుకలు తెప్పల( దేల(గ వేంకటేశ్వరా ! 98

వాలికనేత్రపద్మములు వంచిన యావదనంబు పద్మినీ
పాల జనింపనందుననె పద్మినియై యలమేలుమంగ గో
పాలక చక్రవర్తి నిను( బాయని కౌ(గిట భోగలీల(బాం
చాలుని( జేసె పుష్పశరశాస్త్రవిదగ్ధ్ని వేంకటేశ్వరా ! 99

అమ్మకు దాళ్ళపాకఘను( డన్న(డు పద్యశతంబు జెప్పె(గో
కొమ్మని వాక్ప్రసూనముల గూరిమితో నలమేలుమంగకు
నెమ్మది వీవు చేకొని యనేక యుగంబులు బ్రహ్మకల్పముల్
సమ్మది మంది వర్థిలను జవ్వన లీలల వేంకటేశ్వరా ! 100



English - Annamayya Alamelumanga srivenkateswara satakam.....


Sreesati neelajaaMbavati Sreeyamunaasati satyabhaama dhaa
treesati rukmiNeeramaNi daeviyilaasati veera laMda~ru(n^)
jaesinasaeva chaesedanu jaekonu SreeyalamaelumaMga nee
moosina mutyamai yuramu muMgiTa( jeMgaTa vaeMkaTaeSvaraa !

kannulugalgi komma ninu gappamu( jaekona laetanavvu nee
kennaDu mOvi nichchinado yaegati mechchito yeTTuluMDenO
yanniTa, naenejaaNa nani yaMduvu SreeyalamaelumaMgakae
mannana neTTu lichchitivo maaTala jikkavu vaeMkaTaeSvaraa ! 2

cha . kilakila navvu navvi tilakiMchiti maMchi sudhaarasaMbu nee
palukutaenelan^ vibhuni(baTTamu( gaTTiti needukaugiTan^
valadani cheppinan^ vinavu vaddusumee yalamaelumaMga nee
kelavu laTaMchu nechchelulu keertana saeturu vaeMkaTaeSvaraa ! 3

u:neevunu daanu gooDe daruNeemaNi SreeyalamaelumaMga naa
naavidhavaibhavaMbula nanaaratamuM jeluvoMdu naeDu nee
vaavali mOmu chaesi tani yappaTinuMDiyu( balka viTTulaa
daevara chittamevvariki (daerpaga Sakyame vaeMkaTaeSvaraa ! 4

u:yO lalitaaMgi ! yO kaliki ! yO yelajavvani ! yO vadhooTi ! yO
gOla ! me~ruMgujoopukanugOnala nOyalamaelumaMga ma
mmaelina talli neevibhuna kiMchuka maadesachoopumaMchu nee
paaliki jaeri mrokkuduru padmabhavaadulu vaeMkaTaeSvaraa ! 5

cha.chikurabharaMbuchae (nadimi) SreelalitaaMgivi neevu naaguNaa
dhikuniyuramupai ratula(daeluchu SreeyalamaelumaMga nee
likuchakucha prabhaavamuna laetavayassuna niMta naeturaa
vekali vaTaMDru nechchelulu vaeDkala neesati vaeMkaTaeSvaraa 6

cha.okamari neevu kangonala noyyana(joochina neevibhuMDu lO(
gakavika( darchu( jaerunaTa kaugiTi kOyalamaelumaMga nee
vikacha vilaasa maMchu naraviMdamaraMdapu(daenepalkulan^
bikaSukapaMkti neeku( dalapiMchunu neesati vaeMkaTaeSvaraa! 7

u:koorimi saanavaTTina chakOrapu(gannu(gona daLukkunan^
jaeruva miMchulai me~raya jimmulabommala( baMpu navvu dai
vaaraga( gaaMchi neetaruNi vannela SreeyalamaelumaMga nee
saarapu naerpu( jakkagone( jakkani mOmuna vaeMkaTaeSvaraa ! 8


u:aayalasaMbu laanaDapu laakanu(graevala mudduchoopu laa
yaayelanavvu maaTala priyaMbulu neekalamaelumaMga nee
maayalo praaNavallabhuni makkuva chaetalo cheppu maMchu lae(
braayapu neesatiM jelulu palkiri palma~ru vaeMkaTaeSvaraa ! 9


u:kinnera meeTi meeTi pulakiMchi talaMchi manOjaleela( daa
nunna te~raMgu nechchelula koyyana(jeppagaboonu( jepparaa
kannuva siggutO nalaru nallana SreeyalamaelumaMga nee
vannelasaeta leTTivo suvaaLamu leTTivo vaeMkaTaeSvaraa ! 10

cha.sarasijasaMbhavaadi divijaprakaraMbulasaMpadal^ suvi
staramulu gaa(ga( gangonala jalleDu Sree yalamaelumaMga nee
taruNi yuraMbunaM jelaga(danmaya maMdeDu neeku braatiyae
paramapada prabhutvamu napaaramahattvamu vaeMkaTaeSvaraa ! 11

taruNi! mahaa nidhaanama! sudhaamayakoopasamastavaibhavaa
bharaNama! daevadaevuni kRpaamati! yOyalamaelumaMga! nee
karuNayu jaalu lOkamula( gaava(ga naMchu muneeMdrulun^
sural^ nirati nutiMchi mrokkuduru neepriyakaaMtanu vaeMkaTaeSvaraa ! 12

chedirina chinni laegurulu chekkuna jaa~raga muddumOmutO
vadalina kopputODa niDuvaalika kannulu niggu dae~ragaa
nuduTuna ninnu gooDi mahimOnnatitO nalamaelumaMga nee
yeduTa manOjasaMpadala naegati nuMDeno vaeMkaTaeSvaraa! 13

tolakarimiMchu toyyali vadhoomaNi chakkani talli maaninee
tilakama daevadaevuni sateemaNi yOyalamaelumaMga nee
solapulachoopulae vibhunichoopulaviMdu laTaMchu nechchelul^
palukaga ninnujoochi nagu(baikoni neesati vaeMkaTaeSvaraa! 14

talachu( garaMgu maima~rachu( danmaya maMdunu jittajaagnini
nnalayuchu dooru nussuranu narmilitO nalamaelumaMga nee,
valiginanaMtanae kaDu( briyaMbika naemani cheppanaeDuvO
kaligina miMtayu( brakaaSamu tOcheDu vaeMkaTaeSvaraa ! 15


niMchina paMchadaaralunu naetulu daenelu( gamma gaa(ga( daa
liMchinakooralun^ barimaLiMchaga nayyalamaelumaMga va
DDiMchina nirmalaannamulu DeMda melarpa(ga naaragiMtu nee
miMchina vaeyichaetulanu maelamulaaDuchu vaeMkaTaeSvaraa ! 16


ataDe neevu, neevanaga naataDu, neepalukae talaMpagaa
naatanipalku 'nee hRdaya maataDe pO ' yalamaelumaMga nee
chaetide sarvajaMtuvula jeevanamaMtayu naMchu sanmuni
vraatamu sannutiMchu nanivaaraNa neesati vaeMkaTaeSvaraa ! 17

lOlavilOlanaetraku( daLukkuna ~reppalu vaMchi yettinan^
maelimi( jekkuTaddamula maelamulai yalamaelumaMgakun^
neelapayOdapuMdu~rumu niggutaTillatalae yaTaMchu nu
nmeelanimeelanaMbulake mettuvu neevunu vaeMkaTaeSvaraa 18

pakshmalanaetra ! yOchilakapalkula kalki ! sarOjavalli ! yO
lakshmi lataaMgi yObahukaLaavati yOyalamaelumaMga nee
sookshma vivaeka leelalaku( jokkiti naMchu nakhaeMduvallikaa
lakshmivikaasata sati(jelaMgagajaetuvu vaeMkaTaeSvaraa ! 19

lalitapu kaMkaNaaMkaladhvani ghallani mrOya nuMgaraM
bulu maNineelakaaMtula prabhutvamutO nalamaelumaMga gu
bbala prenuvraegutO( du~rumubhaaramutO ninu( jaeravachchu naM
delu melanoolu ghaMTalu( bratidhvanuleenaga vaeMkaTaeSvaraa ! 20

kuMkuma kasturee prabha bugulkona( jekkula( jaara divyataa
TaMkamaNiprabhaa prativiDaMbamutO nalamaelumaMga bhroo
jaMkela naMdaliMpagane jallane( jittamu neeku naMtalO
naMkana miMchu mimmu( bulakaaMkurakOTulu vaeMkaTaeSvaraa 21

kasturi pachchakappuramu( gammani puppoDi dhooLLu hatti Sree
hastamunaMdu(taTTupunu(gaMduchu SreeyalamaelumaMga bhaa
rastanavaibhavaMbula( garaMguchu ninnu ga~raMga mettu nee
kaustubharatna saudhamuna( kaugiTipaanpuna vaeMkaTaeSvaraa! 22

aMdapu kOsi yimmu viru laMchunu jae ralamaelumaMga ni
nnuMdaga(gOra jekkulaTu nokkina naakunu naMdavaMchu na
yyaMdumukhiM briyaMbalara nettuchu puvvulu kOyajaeya ni
shyaMdamaraMdagharmarasasaMgatu labbenu vaeMkaTaeSvaraa 23

okkokkanaaTiraatri sakalOnnutuDaina khagaeMdra moortipai
nekki vonOdaleela( jariyiMchuchu nayyalamaelumaMga mO
makkuna( jaerchuchu bahuvihaaramula vanaveethulaMbriyaM
bekkuvagaa( jelaMguvidha mae mani cheppudu vaeMkaTaeSvaraa ! 24

dugdhapayOdhikanya jaladhul^ jagamul^ danakukshinunna su
snigdhakRSOdaraaMgi tulasiM briyuraalalamaelumaMga
yee ...... ..... .... nuchu ninnu muneeMdra kanyakal^
digdharaNeedharaMbula nutiMturu navvuchu vaeMkaTaeSvaraa ! 25

paayani jaajipuvvulanae paTTuka baaya ......
........raahutuDaavainapu DaayalamaelumaMga ni
SSraeyasalakshmi neeSaramu cheMgaTa noppe(durushka daesabi
bbeeyelapuvvu payyedane praemapunuvvuna vaeMkaTaeSvaraa ! 26

yO cheli! yO lataapratima! yO mRgalOchana! yOchakOrirO!
yO chadulaala ! yOchiluka ! yO..yalamaelumaMga nee
choochina choopulae vibhuDu choochinachoopulaTaMchu neesatin^
khaecharasiddhi kaaminulu keertana saeturu vaeMkaTaeSvaraa! 27

maMgaLamammakun^ sakalamaMgaLa maMbujanaetrikin^ jayaa
maMgaLa miMdiraa satiki maMgaLameeyalamaelumaMgakun^
maMgaLamaMdu nae mariyu maMgaLamaMdunu daevalOka di
vyaaMganalella neesatiki naaratu litturu vaeMkaTaeSvaraa ! 28

veladi mahaaparaadhamulu vaeyunu jaesiti gaavumanna nee
pulakalu maenighaatalunu bootalu joo chalamelumaMga nee
yalakalu deerchi chekku chema Tallana gOLLanu jimmi payyedan^
baluchani navvutO visaru( bai chemaTaaraga vaeMkaTaeSvaraa ! 29

ae chaturatva maemahima maemi vilaasa madaemi vibhramaM
bee cheluvaMpu saMpadayu niMdumukhul^ jagadaekamOhinul^
choochi talaMTa vaeDkapaDi chooturu neeyalamaelumaMga lee
laachikuraMpu( grummeDi kelaMkula niggulu vaeMkaTaeSvaraa ! 30


parimaLamO kadaMbamo prabhal^ viDa niMchinaniggo nirmalaa
bharaNamo nityavaibhavamo bhaagyamo SreeyalamaelumaMga bhoo
dharunaku naadilakshmi yani tattvamahattvarahasyavaettalaM
baramuna nuMDi neevanita( brastuti saeturu vaeMkaTaeSvaraa ! 31

tirumagu maMchi kuMdanapu(deegapayin^ ghanachakravaakamul^
pariginareeti( jannugava bhaavamutO nalamaelumaMga nee
yuramupayiM jelaMga(gani yOgijanaMbulu neelamaeghavi
sphuraNamutODi miM chanuchu(joochi nutiMturu vaeMkaTaeSvaraa ! 32


koladikimee~ru ( grovvirulu koppuna(jaa~raga( joopukannula(n^)
gulukuchu nuMDa nennuduTikuMkumatO nalamaelumaMga ve
nnelanunu(deegayai kaLaluniMchina puttaDi bommayai ninuM
galiki karaMbunaM jenaya(gaMTirigaa tami vaeMkaTaeSvaraa ! 33

peDamara choochi choopu jaLipiMchina neTlu dhariMtuvO priyaM
baDara(ga( gaunudeega nuliyan^ ................ nan^
saDivaDi yeMtavaeguduvo chakkani SreeyalamaelumaMga nee
veDavagu mOmujoochi nagi vennela challina vaeMkaTaeSvaraa ! 34


.......... gujjena gooLLunu baiDipoLLu maa
yammaku bommariLLu lalitaaMgiki maayalamaelumaMgakun^
bommalu bommapottikalu bOnapudoMtu laTaMchu neesatin^
nemmi bhajiMchi mrokkuduru nirjarakaaMtalu vaeMkaTaeSvaraa 35

O kamaneeya kaMjamukhi ! yOvalaraayani talli! yOsudhaa
saikatachaatureejaghana chakriNee ! yOyalamaelumaMga ! nee
vae karuNiMchi kaavumani vaeDkala niMdra puraMdhru laMda~run^
baikoni neelataapratima brastuti saeturu vaeMkaTaeSvaraa ! 36

jaagaramaela jaesedavu chaMdranibhaanana pavvaLiMpu nee
bhOgapaiSraMbulaku bhooshaNamai yalamaelumaMga nee
yOgaviyOgaleela lani yOgikanyalu neevadhooTi naa
yaagati bujjagiMturu mahaavinayaMbuna vaeMkaTaeSvaraa ! 37

pallavapaaNi viSvagurubhaamini yiTTi prapaMchamaMtakun^
talli samastajeevulanidhaanama SreeyalamaelumaMga nee
challani choopu chilki vedajallaga puNyulamaiti maMDru bhoo
mellanu neevadhoomaNi nanaekavidhaMbula vaeMkaTaeSvaraa ! 38

che~ragiDa(gaa nadalchedavu chaerina diTTedu kaugiliMchinan^
go~ra(tale yenna(joochedavu * kOpamu naddalamaelumaMga naa
ve~ra pi(kanaina deerpumani vaeDkala neevu manOjaleelalan^
da~rita~ri niMti( gooDuTalu( datta~rapaaTulu vaeMkaTaeSvaraa ! 39

* 'kOpamu naMdala maelumaMgaa nuMdanOpu

raapuga mammu naeyunaparaadhaSataMbula saMtamul^ sadaa
..........................................................................................
...........................................................................................
kaapuramun^ niraMtaramu kalkitanaMbunu vaeMkaTaeSvaraa ! 40

velaya vasaMtavaeLa vanaveedhula saMpagipuvvuTiMDlalO
nalaruchu( bushpavRshTi nalapaarchuchu nee valamaelumaMgatO
nalara(ga nae(gi vachchi yalapaara(ga( gasturineeTa majjanaM
belimi vahiMchi gaMdhatatu linniyu( gramma~ra majjanaMbu peM
polaya(ganaaDuteerthamula nubbbu payOdhulu vaeMkaTaeSvaraa ! 41

velaya(ga naeMkaTaachalamuveedhula( gammanipushpavRshTi kiM
palara(ga naegi vachchi yalapaaraga nayyalamaelumaMgatO
nalara(ga( gOrakammula lataaMgana limmula saesa(jallagaa(
galakala navvu mimmu galakaNThaSukaavali vaeMkaTaeSvaraa ! 42

yekkaDi kaegi vachchiMti ramaeSvara neetanudivyagaMdha mae
chakkaniyiMtimaeni dani saareku neeyalamaelumaMga nee
chekku gaLaMbu gOLLa vaDi jaerchuchu neeyalapaarchi vaeDuTal^
makkuvagalgukaaMtalaku marmarahasyamu vaeMkaTaeSvaraa ! 43

..............lanu babbilikaayalu pai(DimaTTiyal^
mOda molarpa naMdiyalu mrOya(ganayalamaelumaMga ka
tyaadaraleela)baaDa baluvaMchunu vaedamu...........'
.............................nu vaeMkaTaeSvaraa ! 44


kaaMchanaratna nootna kaTakaMbulu saMduladaMDalu brabhal^
muMchina maekhalaavaLulu mrOyaga nayyalamaelumaMga nae
traaMchalagarvaveekshaNasuhaasamutO ninu( gOri bhroolatan^
vaMchina diyyavillu kaDavaMchu maruMDunu vaeMkaTaeSvaraa ! 45

voppagu too(guTuyeyyalala nooguchu nee valamaelumaMgatO
nappuDu kau(giTa nratula naa(kaTipelluna nappaLiMchun^
~reppalanavvutO manasu~richchalatO na~ragannulaarchun^
depala(daelu saukhya mide daevarahasyamu vaeMkaTaeSvaraa ! 46

geesinagOLLa chae( basi(Di kinnarakaMpitamul^ kadalchuchun^
raaseDigubbachannulabhraMbuna nayyalamaelumaMgatO
moosiyau mooya kakshu laramODchuchu ~reppala( daela(jae
ya(gaa naasala neevu tanmayamu naMduTa chitramu vaeMkaTaeSvaraa ! 47

doralina maenigaMdapoDidhooLi vasaMtamu gharmavaaripai
ja~rachinapuvvu(daenela vasaMtamu neekalamaelumaMgakun^
ne~rasi karaMgu chittamulu neeLLaa vasaMtamu meeku meeku nee
ye~rapulu neepriyaMbulu mahOnnatu leTTeevO vaeMkaTaeSvaraa ! 48

chakkanitallikin^ navarasaMbula velliki( bushpavallikiM
jakkanimOvimuttiyapujalliki SReeyalamaelumaMgakun^
jekkulu miMchuTaddamulu chaetulu krottame~ruMgudeega laa
krikkirigubbalae pasiDikinna rakaayalu vaeMkaTaeSvaraa ! 49

ariselu noone booriyalu naugulu( jakkeramaMdighal^ vaDal^,
buruDalu paalamaMDiga lapoopamulu yyalamaelumaMga nee
karuduguga viMdhuveTTu paramaannachayaMbulu soopakOTiyu
nirati viniraMlaannamulu naetulasOnalu vaeMkaTaeSvaraa ! 50


kaanika lichche neevibhuDu kaugiTa baaMpuna gammavalpupoo(
daenela gharmabiMduvula daehamunaM dalamaelumaMga nee
vaanagumOmutO vibhuni kaMchu (dalirchi( gaani tanmayaM
bainanu baaya daMchu( jelu laMdaru neesati vaeMkaTaeSvaraa ! 51


pena(gakumamma! chimmu jaLipiMchina choopula garvaraekha raa(
jenakaku mamma! lae(jemaTachekkula nOyalamaelumaMga nee
ghanu(Du kaLaavinOdi ratikaaMta vilaasasahasramoorti va
ddani polayalka deerturu lataaMgulu neesati vaeMkaTaeSvaraa ! 52

kulukakumamma chimmujilukuM gonachoopula bittaraMbugaa
nuluchakumamma bommamuDi noolkona(gOpamu laetanavvugaa
solayaku mamma kalki nunusO(gala nOyalamaelumaMga nee
cheluvuna naMchu nechchelulu chaerturu neesati vaeMkaTaeSvaraa ! 53

chaa(gu baLaa jagatpatiki jaa(gu baLaa jagadaekamaatakun^
chaa(gu baLaa ramaeSunaku ( jaagu baLaa yalamaelumaMgaku
jaa(gu baLa yaTaMchu( gaDu( jakkani kaaMtanu veedhiveedhimee
rae(ga(ga nittu raaratu lanaekavidhaMbula vaeMkaTaeSvaraa ! 54

chochiti( dalli neema~ru(gu soMpu(ga neekaruNaakaTaaksha mo
Tlichchedo naaku nae(Du paramaeSvari ! yOyalamaelumaMga nee
machchka naMchu neetaruNee mannana naeninu(gaMTi neeku naa
bachchenamaaTa laemiTiki braa( tide chooDaga vaeMkaTaeSvaraa ! 55

yechcharikamma paadamulu niMdrasiMdhuranayana tammipoo
nechcheli krottakrottapaluniggulatO nalamaelumaMga nee
vachchina daa(ka neevibhu(Du vaMchina mOmunu netta(DaMchu nee
machchika yiMti niMtula mamattvamu neMturu vaeMkaTaeSvaraa ! 56

kanakapu(beeThi nekki ratikaaMtaSaraakRti neevu veedhulaM
januneDa needu cheMgaTa brasannatatO nalamaelumaMga kaaM
chananavakiMkiNeeravamu sannapudaaLagati rachiMpa(gaa(
ganu(gava mOdchi rati(gaugiTa( jaertuvu vaeMkaTaeSvaraa ! 57

o~rapagumeevihaaratatu luppanabaTTelu billaTeepu la
chcheruvuga ballagOTulu prasidddhiga nayyalamaelumaMgakun^
me~rupulu muchchaTal^ ratula mrokkalu( dakkulu vachchi vachchimee,
chi~runagavuM bra mOdamulu chekkulanokkulu vaeMkaTaeSvaraa ! 58


chakkera bomma chekkulane saanalu paTTina puvvaTammulO
grukkinajavvanaMbu penugubbalO SreeyalamaelumaMga nee
vakkuna( jaerchi paTTa sakalaadhipa saukhyamu neeku nabbegaa
kekkuva paMTu kaMduvala yiMpula soMpula vaeMkaTaeSvaraa ! 59


parimaLamuM brabhaavamu Subhasthiti nityavibhooti vibhrama
sphuraNamu divyavaibhavamu bhOgamu SreeyalamaelumaMga nee
yuramuna naMchu sanmunulu yOgijanaMbulu mechchi mechchi nee,
varavanitaaSirOmaNi navaaraNa( golturu vaeMkaTaeSvaraa ! 60

kulikeDupaMDuTamanula( gOyilakootala guMDe ghallanan^
jeluvamu galgu raakalanu jeMgaTa SreeyalamaelumaMga kO
vilakalanaadakOTulachaviM machariMpa(ga neTToo lOrtuvO
valapulavaardilOna nanivaaraNa( daeluchu vaeMkaTaeSvaraa ! 61


tolu(keDukoppulO nerulO tummedadaaTulo choopuvaMpulO
gulukulO miMchivennelala guMpuloo SreeyalamaelumaMgakun^,
malukulu pachchakappurapu( balkulu taavule divyagaMdhamul^
paluchaninavvulae virulapaaMpulu neekunu vaeMkaTaeSvaraa ! 62

aMdamu chootu ruppavaDamai ghanulaayalamaelumaMgamO
maMdamu gaa(ga jootuvu priyaMbuna mellananeevaTuMda(bO
yaMda~rimOmuTaddamulu navvala navvula gOTikoMDalai
yaMdamulOna naMdamulunai velugoMduchu vaeMkaTaeSvaraa ! 63

tala(china guMDe jallanunu dallaDamaMdeDu naemisaetu naa
cheluvu(Du raa(DataMchu lalaseenavi nO yamaelumaMga nee
tolakarimiMchu nemmanamutoyyali jooDaka yeTToolOrtuvO
yalugaku manna maana vi(kanainanu nennaDu vaeMkaTaeSvaraa ! 64

aayalamaelumaMga kamalaananayaM galuhaaranaetriyaM
baayaka taanayai chelagubradma hitaakshamu(jaMdra naetramu
sOyagaleelamiMchu neTuchoochina( boMdika neddi nidra nee
kaeyaDa maelkonaMga( da~ri yeyyadi chooDaga vaeMkaTaeSvaraa ! 65
ne~ri nalamaelumaMgakunu neekunu padmabhavaaMDabhaaMDamae
me~rasina bommarillu tagumaeDalu mee(daTilOkamul^ prabhal^,
te~rala(ga miMchu nayyinuDe deepamu gujjanagooDu chaMdruDae
to~ralina daevasaMghamule tottulu baMTlanu vaeMkaTaeSvaraa ! 66

vaDi nalamaelumaMga niDuvaalikachoopunivaaLi neepayi
suDisina tammiraekulaMbrasoonaSaraMbulu galvaraekula
baDibaDi mee(damee(da rasabhaavaMga diga(bOsinaTla pO
poDavagu puvvujoMpamula poojalu neekunu vaeMkaTaeSvaraa ! 67

ninu nalamaelumaMga ghananeerajapaMktulu daa(ka naesina
janu(gava nottinaTlu kerajaMbula vaaMDlunu nottinaTlu ni
gguna( ganudOyitaamarala( goMkaka saareku nottinaTlu mai(
jenaki maruMDu baaNamulu chimmneeyaTlagu vaeMkaTaeSvaraa ! 68

apu DalamaelumaMga polyalkalu vaddani chaaTi cheppina
gapaTapuTalka lallitivi garvitanaMbuna gaaMta kOramae
rapamunajootugaa kaluka raajasaleelala niMta dee~runaa
vipulaviyOgataapamuna vaeDukakooTami vaeMkaTaeSvaraa ! 69



ila nalamaelumaMga ninu naemani tiTToonO yaekataMbuna
galiki me~ruMguDaalu telikannula jaMkena naddaiMpuchu
balukulamuddu liMpolaya bhaarapu gubbala doora nettuchu
jalajala koppusaMpe(galu jaajulu raalaga vaeMkaTaeSvaraa ! 70



tagunalamaelumaMgakunu danmayamaMdeDuneeku maenilO
magaTulu machchimaaTalanu bachchenayechcharikal^ vivaekamul^
mekgamul^ lae(tanavvulunu mOvulanaaTulutammitooTulu
jagaDapu(boMdulu ratulasaMpadaviMdulu vaeMkaTaeSvaraa ! 71


sari nalamaelumaMgakunu jakkanimeekunu meeku meeku lO
naruduga naekatasphuraNa nammuDu nOyiti rokkarokkaru
iruvuru niMka naeTiteli vekkaDinaerupu laeTisairaNal^
girapulapuchche maena bulakiMtalu viMtalu vaeMkaTaeSvaraa ! 72

okayalamaelumaMga mahimOnnati jikkiti yOgaleekachae
jikurabharaMbu jaa~ra nalase nikhilonnatu DaMchu nee kRpa
brakaTamulaina kaaMta.....yiMtaru Seetala kriya
mokaMlula niggu dae~ra(ganu moochchaTalaaDuchu vaeMkaTaeSvaraa ! 73

naga valamaelumaMgakunu naaTa vavalkalu neeku maaTala
baga DalamaelumaMgakunu bachchenagarvamu neeku joopula
jigi yalamaelumaMgakunu Sreemala vaeDuka neekuniTlapO
migilina mOhasaMpadalu meerunu meerunu vaeMkaTaeSvaraa ! 74


eeyalamaelumaMga maNihaemakaTeeraSanaakalaapamul^
raayaMga raalu baiDipoDi raMtulu mee~rinavajrapuMboDi
Sreeyalaraarukoppuna brasiddiga raaleDu kammapuppoDi
neeyanu(guMgavuMgiTiki nichche vasaMtamu vaeMkaTaeSvaraa ! 75

OyalamaelumaMga yidi yokkaTi pO jagadaeka bhartaku
baayaneekunuM gaDama praaNamu praaNamu naekamaaye nee
kaayamu kaayamuM galise gaugiTakaaMksha yaTaMchu neesati
braayamu niMDujavvanamu balma~ru metturu vaeMkaTaeSvaraa ! 76

itaDalamaelumaMga vibhu( DeetaDevO kalaSaabdhikanyaku
satatamu jittamichchina rasaj~nuDu praaj~nuDu sarvavaibhavO
nnatuDu ramaasatee priyuDu naMdakaSaarjadharuMDaTaMchu ni
nnativalu mechchi mechchi koniyaaDudu reppuDu vaeMkaTaeSvaraa ! 77

maayalamaelumaMga chalamaa yalayiMcheda veMtasaesina
dOyajagaMdhi neeku matitODane takkina dalkanOpu naa
chaeyaga naerchuchae(ta live chaeyudugaaka lataaMtasaayaMkuM
DeeyeDa jaeyu vaedsana lakinniyu dODugu vaeMkaTaeSvaraa ! 78

mati nalamaelumaMgakunu maMtanamaaDeDu neevilaasamul^
tati(dalapOtalai suratataaMDavasaMbhramaleelalai samaM
chitarasaprasaMgamulu chimmanidoMtaralai priyaMbulai
vitatamanOjavidyala nveenamu lainavi vaeMkaTaeSvaraa ! 79

kasigalachoopu chimmudunu kaMkaNahastamu saa(chi kuMchechae
visaraku rammanaMga vaDi vannelamOmuna mudgugulkeDi
rasikuna kaMchu jakkani puraMdhrini neeyalamaelumaMgatO
musimusi navvu navvuduru moochchaTalaaDuchu vaeMkaTaeSvaraa ! 80

naaDalamaelumaMga jananaMbunakai kalaSaabdhi(drachchi yee
moo(DujagaMbulaMdunu bramOdamu niMchiti vaTla nuMDuchO
naa(Du(danaMpubRMda madayaMbunu boMdaga nityasaMpadal^
nae(Di(ka naemiTaM gaDama neekRpa vaariki vaeMkaTaeSvaraa ! 81

eetaruNeemaNee vibhuniyichchaku( jaalutalaMpa neeyanaa
eetani mOhaneegajamu eevani kaayalamaelumaMga nae(
Deetanuvalli chakka(danamu.... .... .... cheluvaMbu chaaladaa,
yee telimiM chaTaMchu nutiyiMturu neesati vaeMkaTaeSvaraa ! 82

maNulaveluMgu deepavanamaalikalai pogaDoMda( gaMkaNa
kvaNanamu maekhalaavaLulaghaMTalu SreeyalamaelumaMgaku
braNayavinOda saMpadaku baayaka nee konariMchupoojakai
praNutanutaprabhaavamula bhaagyamu lainavi vaeMkaTaeSvaraa ! 83

kadisinsaesamu taimula kaMThasurul^ ghnaratna kaMkaNaaM
gadaraSanaa..nikaayamu SreeyalamaelumaMgaku
brayavinOda saMpadaku baayaka nee konariMchupoojakai
praNutanutaprabhaavamula bhaagyamuainavi vaeMkaTaeSvaraa ! 84

nigiDi pa yOdhi drachchu neDa nirjarasaMghamu nikki chooDagaa
dhagadhaga yaMchu dikkula nudagrataTillata lullasillagaa
daga nudayiMchi miMchina sudhaaprati meeyalamaelumaMga nee
maguva yaTaMchu metturu samastamuneeMdrulu vaeMkaTaeSvaraa ! 85

naDavakumamma paadanalinaMbulu gaMdeDi, maaTa beTTugaa
noDuvakumamma, chekkunanu nokkulatO nalamaelu maMga nee
veDunaga keemogaMbunaku vennelalaaye naTaMchu neessati
baDatulu maelamaaDuduru palkula taenela vaeMkaTaeSvaraa ! 86

bootalabaMDlanae valapubukkiTa niMchiti vaaDikOLLanae
ghaatalu gaaga jiMchitivi kaayamupe nalamaelumaMga nee chaetide yaMchu
neetaruNi cheMchtala daTTapunuMgugasturi
jaatudu rOli needu parichaarika kaaMtalu vaeMkaTaeSvaraa ! 87

pachchala saMdidaMDalunu baahupurul^ maNinoopuraMbulu
machcharikaMbuluM basiDimaTTela mrOtalu bellu mrOyagaa
nechchelu lOli golva daruNeemaNi SreeyalamaelumaMga nee
muchchaTa deerchu nokkapari muMda~ra nilchina vaeMkaTaeSvaraa ! 88

yaechina paatakaMbulaku niniTiki nnirvainavaaDa nae
gaachinakashTavRtti karigaapane yOyalamaelumaMga nee
choochukRpaanireekshaName choocheda naMchunu neepriyaaMgana
boochina vaakorasoonamula boojulu saeseda vaeMkaTaeSvaraa ! 89

yOgyatlaenikashTuDa nayOgyuDa nanniTa jooDa garbhani
rbhagyuDa neekRpamatiki braptuDa nOyalamaelumaMga naa
bhaagyamu neegRpaakaruNa braapyamu kaavumaTaMchu saarenee
bhaagyavatee SirOmNini bastutisaeseda vaeMkaTaeSvaraa ! 90

tu~ru ma~raveeDe bayyadayu dODane jaa~re me~ruMgu ~reppala
maravaSabhava maerpaDiye baayaka nee valamaelumaMga nee,
varuni dalaMchitO yanuchu vaasanamaenula daeva kaaminul^
saraguna neelataaMgi kupachaaramu saeturu vaeMkaTaeSvaraa ! 91

raajasaleela nannunu garaMbuna baTTaku choopa vaela nee
taejamu naa kaTaMchu sudateemaNi Sree yalamaelmaMga ni
nnee jagadaekanaayakuni niMpolayiMchuchu saaresaareku
jaajulukoppuveeDa sarasaMbuna veechunu vaeMkaTaeSvaraa ! 92

chakkadanaMbu raaSi nunusaanala baTTinapuvvTammulO
jakkera niMchi chaesina rasasthiti SreeYalamaelumaMga nee
makkuva jikki maaTalabhramaM dagulai kaluvaMta niTla nee
vakkuna jaerpagaa nalare nannuva kaugiTa vaeMkaTaeSvaraa ! 93

maanavteesirOmaNiki maMjulavaaNiki mOvitaeniyal^
kaanikalichchinaaDa vaTa kaugiTa naayalamaelumaMgaku
meenachakOranaetri ninu mechchi madaMbuna gaugeeMchi nee
paanupumeedi chaeta livi pachchi talaMpulu vaeMkaTaeSvaraa ! 94

dhaLadhaLa miMchu kannugavatammula mimmula joopu chimmina
gaLavaLamaMdakuMDudure grakkuna SreeyalamaelumaMgaku
saLuvula navvu goMta nunusOnalagarvamu goMtanavvugaa
kelapula goMtukoMta pulakiMtalu viMtalu vaeMkaTaeSvaraa ! 95

darpaka raajyasaMpadalu tnmayakOTulu raagilOkasaM
tarpaNmuL^ lataadharasudhaaparidhaanamu laananavratul^
karpuragaMdhasaookhyamulu grakkuna SreeyalamaelumaMgaku
maarpaDu daehasaMgatula marmipujaetalu vaeMkaTaeSvaraa ! 96

aMbaramella( jaMdramaya mainaTulaamadanaaMkaMl^ meyi
baMbina naeDa vaMchu siri palkina nayyala maelumaMga paa
daMbula yaana veTTitivi tammiyaguLLani neeku boMkulae
neMbaLmaaye nevvariki( jellavu raMtulu vaeMkaTaeSvaraa ! 97

che~rugulu choopi krovvirulu chiMdeDu taenelu naalguvaMkala
varadalu vaa~re gharmamulu vaahinulai yalamaelumaMgatO(
ga~r^(guchu neevu ka(giTa sukhasthiti( gooDuchu baMdhusaMgati
de~ru diganaesi vaedukalu teppala( daela(ga vaeMkaTaeSvaraa ! 98

vaalikanaetrapadmamulu vaMchina yaavadanaMbu padminee
paala janiMpanaMdunane padminiyai yalamaelumaMga gO
paalaka chakravarti ninu( baayani kau(giTa bhOgaleela(baaM
chaaluni( jaese pushpaSaraSaastravidagdhni vaeMkaTaeSvaraa ! 99

ammaku daaLLapaakaghanu( Danna(Du padyaSataMbu jeppe(gO
kommani vaakprasoonamula goorimitO nalamaelumaMgaku
nemmadi veevu chaekoni yanaeka yugaMbulu brahmakalpamul^
sammadi maMdi varthilanu javvana leelala vaeMkaTaeSvaraa ! 100